farooq abdullah: రాముడు, అల్లా ఓటు వేసి గెలిపించరు: ఫరూక్ అబ్దుల్లా

  • 2019లో రాముడు గెలిపిస్తాడని బీజేపీ భావిస్తోంది
  • ఓట్లు వేసేది ప్రజలు.. దేవుళ్లు కాదు
  • దేవుడు బీజేపీని గెలిపించడు

బీజేపీపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా నిప్పులు చెరిగారు. దేవుళ్లు రాజకీయ పార్టీలకు ఓటు వేయరని ఆయన అన్నారు. అయోధ్య రామ మందిరం అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '2019 ఎన్నికల్లో రాముడు గెలిపిస్తాడని బీజేపీ భావిస్తోంది. దేవుడు వారిని గెలపించడు. ప్రజలు ఓట్లు వేస్తారే కానీ... రాముడు, అల్లా ఓటు వేయరు' అంటూ వ్యాఖ్యానించారు.

రామ జన్మభూమి-బాబ్రీ మసీద్ వివాదంపై విచారణను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఈ అంశంపై బీజేపీని విమర్శిస్తున్నాయి. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అయోధ్య అంశం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోందని మండిపడుతున్నాయి.

More Telugu News