pok: పీఓకే గుండా పాక్-చైనా బస్సు సర్వీసు.. భారత్ ఆగ్రహం!

  • లాహోర్ నుంచి చైనాలోని కషగర్ వరకు బస్సు సర్వీసులు
  • ఈ నెల 13 నుంచి సర్వీసులు ప్రారంభం
  • మా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనన్న భారత్

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు కింద ఈ నెల 13న బస్సు సేవలను ప్రారంభించబోతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) గుండా ఈ బస్సులు నడవనున్నాయి. పాక్ లోని లాహోర్ నుంచి చైనాలోని కషగర్ వరకు బస్సు సర్వీసులు ప్రారంభకానున్నాయి.

ఈ నేపథ్యంలో, ఈ సర్వీసులపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీవోకే గుండా బస్సు సర్వీసులను నడపం తమ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమవుతుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ తెలిపారు. 1963లో చైనా-పాకిస్థాన్ లు చేసుకున్న సరిహద్దు ఒప్పందం అక్రమమైనదని... భారత్ దాన్ని ఎన్నడూ గుర్తించలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో పీవోకే గుండా ఎలాంటి బస్సు సర్వీసులను నడిపినా అది నిబంధనల ఉల్లంఘనే అవుతుందని అన్నారు.

More Telugu News