Andhra Pradesh: కర్ణాటక అవతరణ దినోత్సవం.. ట్విట్టర్ లో స్పందించిన పవన్ కల్యాణ్!

  • రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపిన నేత
  • 1956, నవంబర్ 1న ఏర్పడిన కర్ణాటక
  • 1973లో మైసూరు నుంచి కర్ణాటకగా పేరు మార్పు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తాజాగా కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కన్నడిగులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ట్విట్టర్ ద్వారా పవన్ స్పందిస్తూ..‘కర్ణాటకలోని సోదర, సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.


భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా 1956, నవంబర్ 1న కర్ణాటక కూడా ఏర్పాటైంది. ప్రస్తుతం కర్ణాటకగా ఉన్న ప్రాంతం బ్రిటిష్ హయాంలో మద్రాస్ ప్రెసిడెన్సీ, మైసూర్ రాజ్యం, నిజాం స్టేట్, బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. 1928లో ఏర్పాటైన నెహ్రూ కమిటీ కన్నడ మాట్లాడే ప్రాంతాలన్నింటిని ఏకం చేయాలని సిఫార్సు చేసింది. ఆ తర్వాత అనేక కన్నడ సంఘాలు పోరాడటంతో ప్రత్యేక కర్ణాటక ఏర్పాటైంది. 1973, నవంబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి యు.దేవరాజ్ అర్స్ మైసూర్ స్టేట్ పేరును కర్ణాటకగా మార్చారు.

More Telugu News