Harish Rao: హరీశ్ కారును ఆపి.. తనిఖీ చేసిన అధికారులు

  • ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు
  • సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయం వద్ద తనిఖీలు
  • అధికారులకు సహకరించిన హరీశ్ రావు
ఎన్నికలు వస్తే తనిఖీలు కామన్. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. డబ్బు, మద్యం పంపిణీలు జరుగుతాయనే అనుమానంతో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయం వద్ద నేడు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అయితే అదే సమయంలో మంత్రి హరీశ్ రావు హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని సిద్ధిపేటకు వస్తున్నారు. ఆయన కారును ఆపిన అధికారులు పూర్తిగా తనిఖీ చేశారు. హరీశ్‌రావు కూడా అధికారులకు అడ్డు చెప్పకుండా సహకరించడం గమనార్హం
Harish Rao
Siddipet
Collectorate
Husnabad

More Telugu News