Meeseva: మీసేవ బంద్ లేదు..యథావిథిగా సేవలు: మీసేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచన మేరకే నిర్ణయం
  • ప్రభుత్వం ఏర్పడ్డాక సమస్యలపై దృష్టి
  • యథావిథిగా సేవలు.. అవసమైతే అదనపు సేవలు

ప్రకటించినట్లుగా రేపటి నుంచి మీసేవ బంద్ లేదని ‘తెలంగాణ మీసేవ సంఘం’ అధ్యక్షుడు జీవన్ ప్రసాద్ ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశామని, ఎన్నికల తరువాత మాట్లాడుతామని సీఎస్ చెప్పినట్లు జీవన్ తెలిపారు. ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని, ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం ఉండడంతో ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని సమస్యలపై దృష్టి పెడదామని, ఈ కారణంగానే ప్రస్తుతం సమ్మెకు దిగడం సరికాదని భావిస్తున్నామని జీవన్ వెల్లడించారు. తాము సమ్మెలో పాల్గొనడం లేదని స్పష్టం చేసిన జీవన్.. మీసేవ కార్యాలయాలు యథావిథిగా కొనసాగుతాయని, అవసరమైతే మరో రెండు గంటలు అదనంగా మీసేవ సెంటర్లను నడుపుతామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News