anupamkher: ఎఫ్టీఐఐ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న అనుపమ్ ఖేర్

  • అంతర్జాతీయ ప్రాజెక్టులతో నేను బిజీగా ఉన్నా
  • ఎఫ్టీఐఐకు సమయాన్ని కేటాయించలేకపోతున్నా
  • అందుకే, ఆ పదవి నుంచి తప్పుకుంటున్నా

ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన పదవి నుంచి తప్పుకున్నారు. అంతర్జాతీయ ప్రాజెక్టులతో తాను బిజీగా ఉన్నానని, ఎఫ్టీఐఐకు సమయాన్ని కేటాయించలేకపోతున్నందువల్లే ఈ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు అనుపమ్ ఖేర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఎఫ్టీఐఐ చైర్మన్ గా వ్యవహరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఈ పదవిలో ఉండటం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నానని అన్నారు. కాగా, 2017 అక్టోబర్ 11న ఎఫ్టీఐఐ చైర్మన్ గా అనుమప్ ఖేర్ బాధ్యతలు స్వీకరించారు.

More Telugu News