amalapaul: ఈ సారి నా పెళ్లి విషయంలో నిర్ణయం అమ్మానాన్నలదే: అమలా పాల్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్, ఆ తరువాత ఒక దర్శకుడిని వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వలన ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. తమిళ .. మలయాళ భాషల్లో తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకి రెండవ పెళ్లిని గురించిన ప్రశ్న ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. "ప్రస్తుతం నా దృష్టి అంతా కూడా నా కెరియర్ పైనే వుంది.  ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. మొదటిసారి వివాహం నా నిర్ణయం వలన జరిగింది. కానీ అది ఎక్కువ కాలం నిలబడలేదు. అందువలన ఈ సారి నా పెళ్లి నిర్ణయాన్ని మా అమ్మానాన్నలకే వదిలేశాను. వాళ్లు నా మంచినే కోరుకుంటారు గనుక, ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్లనే చేసుకుంటాను" అని చెప్పుకొచ్చింది. ఇక తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని ఆమె అనడం కొసమెరుపు.   
Go Back to Shorts
amalapaul

More Telugu News