charan: డౌట్ లేదు సంక్రాంతి బరిలోకి చరణ్ దిగేస్తున్నాడు

  • బోయపాటితో చరణ్ మూవీ
  • రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి
  • నవంబర్ 10తో షూటింగ్ పూర్తి    

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'వినయ విధేయ రామ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో చరణ్ జోడీగా కైరా అద్వాని కనిపించనుంది. ఈ సినిమా షూటింగులో జాప్యం జరుగుతోందనీ .. సంక్రాంతికి విడుదల కావడం కష్టమేననే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గురించి దర్శక నిర్మాతలు స్పందించారు.

ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయిందనీ .. రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని అన్నారు. నవంబర్ 10వ తేదీ నాటికి వాటి చిత్రీకరణను కూడా పూర్తిచేస్తామని చెప్పారు. షూటింగ్ పూర్తయిన వెంటనే డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నామనీ, సంక్రాంతికి ఈ సినిమాను తప్పకుండా రిలీజ్ చేస్తామని అన్నారు. త్వరలోనే ఫస్టులుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నామని చెప్పారు. మొత్తానికి సంక్రాంతికి చరణ్ రాక ఖాయమైపోయిందన్న మాట.     

More Telugu News