jagan case: 2న విచారణకు హాజరు కండి : వైసీపీ నేతలు రాజన్నదొర, మజ్జి శ్రీనివాసరావులకు సిట్‌ నోటీసులు

  • దాడి కేసులో ప్రత్యక్ష సాక్షులు వీరు
  • విజయనగరం వచ్చి స్వయంగా అందించిన అధికారులు
  • న్యాయస్థానం ద్వారా వాంగ్మూలం ఇస్తామని వీరిద్దరూ అన్నట్లు సమాచారం
విశాఖ ఎయిర్‌ పోర్టులో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్న వైసీపీ నేతలు పీడిక రాజన్నదొర (సాలూరు ఎమ్మెల్యే), మజ్జి శ్రీనివాసరావులకు సీట్‌ అధికారులు నోటీసులు అందించారు. నవంబర్‌ 2వ తేదీన విశాఖలోని సిట్‌ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంగళవారం విజయనగరం వచ్చిన అధికారులు వీటిని నాయకులకు అందించారు. నోటీసులపై స్పందించిన ఈ ఇద్దరు నాయకులు తాము నేరుగా విచారణకు హాజరుకామని, అధిష్ఠానం ఆదేశాల మేరకు న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇస్తామని చెప్పినట్లు సమాచారం. నోటీసులు ఇచ్చిన విషయాన్ని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) ధ్రువీకరించారు.
jagan case
sit
notices to two leaders

More Telugu News