paruchuri: త్రివిక్రమ్ కొత్తగా ఏం చెప్పివుంటాడా అనే 'అరవింద' చూశాను: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
తాజాగా ఈ వారం 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు."అరవింద సమేత' చూసిన తరువాత ఒక మంచి సినిమా చూశాను అనిపించింది. ఈ కథను ఎంచుకున్నందుకు త్రివిక్రమ్ ను .. అంగీకరించినందుకు ఎన్టీఆర్ ను అభినందిస్తున్నాను.

మంచి ఇమేజ్ వున్న హీరోల ద్వారా కొన్ని మెసేజ్ లు ఆడియన్స్ కి వెళ్లాలి. మేము 'ఆది' .. 'ఇంద్ర' .. 'సమరసింహా రెడ్డి' సినిమాలకి రాశాము. ఇవన్నీ కూడా ఫ్యాక్షన్ సినిమాలే కావడంతో, త్రివిక్రమ్ కొత్తగా ఏం చెప్పివుంటాడా అనుకుంటూ థియేటర్లో కూర్చున్నాను. పగ .. ప్రతీకారాలతో నరుక్కోవడానికి వెళ్లే మగవాళ్లు తమ భార్యలను గురించి, వాళ్ల పసుపుకుంకుమల గురించి ఆలోచించండి అనే అద్భుతమైన పాయింట్ ను త్రివిక్రమ్ చాలా సక్సెస్ ఫుల్ గా అందించాడు" అని చెప్పుకొచ్చారు.   
Go Back to Shorts
paruchuri

More Telugu News