veerappa moili: ఏ మాత్రం కృతజ్ఞత లేని వ్యక్తి కేసీఆర్: వీరప్ప మొయిలీ

  • తాము తెలంగాణ ఇవ్వడం వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు
  • రాహుల్ ను విమర్శించిన కేసీఆర్ ను.. తెలంగాణ ప్రజలు క్షమించరు
  • మహాకూటమి ఏర్పాటు అయినందున తెలంగాణలో విజయం ఖాయం
తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసిందని... తాము తెలంగాణను ఇస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నారు. ఇదంతా మరిచిపోయి ఇప్పుడు తమ అధినేత రాహుల్ గాంధీపైనే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏమాత్రం కృతజ్ఞత లేని వ్యక్తి కేసీఆర్ అని ధ్వజమెత్తారు. రాహుల్ ను 'బిగ్గెస్ట్ బఫూన్ ఆఫ్ ది కంట్రీ' అంటూ దారుణంగా విమర్శించిన కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు క్షమించబోరని అన్నారు.

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం శుభ సంకేతమని మొయిలీ అన్నారు. బీజేపీని సాగనంపేందుకు యూపీఏలోకి టీడీపీ వస్తానంటే... మనస్పూర్తిగా స్వాగతం పలుకుతామని చెప్పారు. ఐదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని... ఛత్తీస్ ఘడ్ లో గెలుపొందినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మహాకూటమి ఏర్పాటు అయినందుకు తెలంగాణలో విజయం సాధించడం ఖాయమని చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే... కేంద్రంలో ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు. 
veerappa moili
Rahul Gandhi
kcr
Telugudesam
congress
TRS
mahakutami

More Telugu News