ఆంధ్రాకు బీజేపీ అన్యాయం చేస్తుంటే.. వైసీపీ, జనసేన పార్టీలు వారికి కొమ్ముకాస్తున్నాయి!: టీడీపీ ఎంపీ కొనకళ్ల
- ఏపీకి న్యాయం చేయాలని పోరాడుతున్నాం
- బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది
- రాబోయే ఎన్నికల్లో టీడీపీకే పట్టం
ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని కొనకళ్ల మండిపడ్డారు. అలాంటివారికి ప్రస్తుతం ఏపీలో వైసీపీ, జనసేన పార్టీలు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలే వీరికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు మరోసారి టీడీపీకే పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు.