modi: నాడు మోదీ చెప్పిందేమిటి? నేడు చేస్తున్నదేమిటి? :సీఎం చంద్రబాబు ఫైర్

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పారని, కేంద్రంపై పోరాటానికి అందరూ సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు మరోమారు పిలుపు నిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ధర్మపోరాట సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఆరోజున నరేంద్రమోదీ చెప్పిందేమిటి? ఈరోజున చేస్తున్నదేమిటి? అని మండిపడ్డారు. మోదీ హామీలు నమ్మి ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, నమ్మకద్రోహం చేశారని నిప్పులు చెరిగారు.

 నాడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్లే ప్రజల్లో నమ్మకం పెరిగి ఆ పార్టీకి దేశ వ్యాప్తంగా ఓట్లు వేశారని  అన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ లో ఇచ్చిన హామీని, నేటి ప్రధాని మోదీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కుల కోసం విభజన సమయంలోనూ, ఇప్పుడూ పోరాడుతున్నది టీడీపీ ఎంపీలు మాత్రమేనని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పార్టీలు కూడా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని మద్దతు తెలిపిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.
Go Back to Shorts
modi
Chandrababu
cuddapah
dharmaporata sabha

More Telugu News