KEkrishnamurthy: సీబీఐ నిర్ధారించిన రూ.44వేల కోట్ల అవినీతిని జగన్‌ ఒప్పుకుంటే మంచిది: కేఈ కృష్ణమూర్తి

  • రామ్‌మాధవ్, జీవీఎల్‌పై ఆగ్రహం
  • రామ్‌మాధవ్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటి
  • చిల్లర విషయాలకు బీజేపీ నేతలు తెగ మాట్లాడుతున్నారు

జగన్‌పై దాడికి సంబంధించి సీబీఐ విచారణ కోరడం మంచిదేనని, అయితే అదే సీబీఐ నిర్ధారించిన రూ.44 వేల కోట్ల అవినీతిని జగన్ ఒప్పుకుంటే మంచిదంటూ ఏపీ డిఫ్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. బీజేపీ నేతలు రామ్‌మాధవ్, జీవీఎల్‌లపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరు మెదపని బీజేపీ నేతలు చిల్లర విషయాలకు మాత్రం తెగ మాట్లాడుతున్నారన్నారని విమర్శించారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దశాబ్దాల క్రితం ఏపీని వదిలేసిన రామ్ మాధవ్, జీవీఎల్ ఇప్పుడు రాష్ట్రంపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముని పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ రావణాసురునిలా వ్యవహరిస్తోందన్నారు. తిరుమలపై కుట్ర చేసిన తరహాలోనే శబరిమలలోనూ కుట్ర చేసే పనిలో కేంద్రం బిజీగా ఉందని ఆరోపించారు. ‘ముందు నీ పదవి గురించి ఆలోచించుకోమన్న’ రామ్‌మాధవ్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటి అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా రామ్‌మాధవ్ ప్రయత్నిస్తున్నారా?.. అని ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News