AIADMK: జయ సమాధివద్ద మోకరిల్లి క్షమాపణ చెబితే మళ్లీ పార్టీలో చేర్చుకుంటాం: అన్నాడీఎంకే

  • 18 మంది మాజీ ఎమ్మెల్యేలకు అన్నాడీఎంకే షరతు
  • పార్టీ పత్రిక ‘నమదు అమ్మా’లో వ్యాసం ప్రచురితం
  • దినకరన్ మినహా అందరికీ పార్టీలోకి అవకాశం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత సమాధి వద్ద మోకరిల్లి క్షమాపణ చెబితే అనర్హతకు గురయిన అమ్మామక్కల్ మున్నెట్ర పార్టీలోని 18 మంది మాజీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమని అన్నాడీఎంకే ప్రకటించింది. మెరీనాబీచ్‌లోని జయ సమాధి వద్ద మోకరిల్లి క్షమాపణలు చెప్పుకుంటే భేషరతుగా 18 మంది మాజీ శాసన సభ్యులను పార్టీలో చేర్చుకుంటామని, ఈ మేరకు క్షమాపణ పత్రాలను పార్టీ అధిష్టానవర్గానికి సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.

ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తూ ఆ పార్టీ పత్రిక ‘నమదు అమ్మా’లో ఓ వ్యాసం ప్రచురితమైంది. అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు దినకరన్ మినహా మిగతావారందరినీ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమేనని అన్నాడీఎంకే ప్రకటించిన మరుసటి రోజే పత్రికలో ఈ వ్యాసం ప్రచురితమవడం సంచలనం సృష్టించింది.

  • Loading...

More Telugu News