prabhas: 'సాహో' మేకింగ్ వీడియో సంచలనం

  • సుజీత్ దర్శకత్వంలో 'సాహో'
  • దూసుకుపోయిన మేకింగ్ వీడియో 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి   

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'సాహో' సినిమా రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో దూసుకుపోయింది. విడుదలైన 24 గంటల్లోనే ఈ మేకింగ్ వీడియోకి 10 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఒక్క యూట్యూబ్ లోనే 'సాహో' మేకింగ్ వీడియోకి 4 మిలియన్ల వ్యూస్ లభించడం విశేషం. చాలా తక్కువ సమయంలో ఎక్కువమందికి చేరిన వీడియోగా .. ఎక్కువ లైక్స్ తెచ్చుకున్న వీడియోగా సంచలనాన్ని సృష్టించింది. ఇక ప్రభాస్ అభిమానులంతా కూడా ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ప్రభాస్ కెరియర్లో ఇది చెప్పుకోదగిన సినిమా అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

More Telugu News