venky: జ్యోతిష్యం నేపథ్యంలో సాగే 'వెంకీ మామా'

  • బాబీ దర్శకత్వంలో 'వెంకీ మామ'
  • పూర్తి వినోదభరితంగా సాగే కథ 
  • వచ్చేనెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్

వెంకటేశ్ .. నాగచైతన్య కథానాయకులుగా 'వెంకీ మామా' సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఈ మధ్య లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. దాంతో దర్శక నిర్మాతలు వెంటనే స్పందిస్తూ, ఈ ప్రాజెక్టు ఉందని ప్రకటించారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల 12వ తేదీన మొదలవుతుందని చెప్పారు.

బాబీ ఈ సినిమాను పూర్తిస్థాయి వినోదభరితంగా తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తోంది. ఈ కథ అంతా కూడా జ్యోతిష్యం చుట్టూ తిరుగుతుందనేది తాజా సమాచారం. జ్యోతిష్యం .. నమ్మకాలు .. గ్రహాలు .. వాటి ఫలితంగా మామా అల్లుళ్ల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు పూర్తి వినోదభరితంగా వుంటాయని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా రకుల్ .. హ్యూమా ఖురేషి కనిపించనున్నారు. నిజ జీవితంలో మేనమామ - మేనల్లుడు అయిన వెంకీ .. చైతూ, తెరపై ఆ పాత్రలను ఎలా పండిస్తారో చూడాలి.   

  • Loading...

More Telugu News