Pollution: హైదరాబాద్ గాలిలో నైట్రోజన్ డయాక్సైడ్... ప్రజల ఆరోగ్యానికి విఘాతం!

  • గాల్లో పెరుగుతున్న ఎన్ఓటూ పరిమాణం
  • వెల్లడించిన 'గ్రీన్ పీస్'
  • విజయవాడ, విశాఖ, రామగుండంలోనూ ఇదే పరిస్థితి

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రమాదకరమైన నైట్రోజన్ డయాక్సైడ్ (ఎన్ఓ2) పరిమాణం పెరిగింది. శాటిలైట్ల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన పర్యావరణ సంస్థ 'గ్రీన్ పీస్' ఈ విషయాన్ని వెల్లడించింది. గాల్లో పెరుగుతున్న ఎన్ఓ2 పరిమాణంతో ప్రజల ఆరోగ్యానికి విఘాతమని తెలిపింది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని రామగుండం, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని వుందని, వాహనాల సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది.

రామగుండంలో థర్మల్ ప్లాంట్ల కారణంగా విషవాయువులు గాల్లో కలుస్తున్నాయని తెలిపింది. యూరోపియన్ స్పేస్ ఏజన్సీ సెంటినల్ 5పీ శాటిలైట్ ఈ సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు మధ్య విషవాయువులు, వాహనాలు వదిలే పొగలోని విషాల గురించిన సమాచారం అందించిందని 'గ్రీన్ పీస్' పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 ఎన్ఓ2 హాట్ స్పాట్లలో ఢిల్లీ తో పాటు ఒడిశా, యూపీ, మధ్యప్రదేశ్ రీజియన్లు ఉన్నాయని, తెలంగాణలోని రామగుండం మరింత ప్రమాదకరమైన ప్రాంతమని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News