mahakutami: మళ్లీ మొదటికి వచ్చిన మహాకూటమి సీట్ల సర్దుబాటు.. కోదండరామ్ కు డిప్యూటీ సీఎం ఆఫర్

  • మిత్రపక్షాలకు కోరినన్ని సీట్లు ఇవ్వలేమన్న కాంగ్రెస్
  • స్క్రీనింగ్ కమిటీ భేటీలో నిర్ణయం
  • కూటమిలో టీజేఎస్, సీపీఐ కొనసాగడంపై నీలినీడలు

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం టీవీ సీరియల్ లా కొనసాగుతోంది. సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చిందని భావిస్తున్న తరుణంలో... సీన్ మళ్లీ మొదటికే వచ్చింది. మిత్రపక్షాలు కోరినన్ని సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.  టీడీపీకి 9, టీజేఎస్ కు 3, సీపీఐకి 2 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో, కూటమిలో టీజేఎస్, సీపీఐ కొనసాగడంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరోవైపు కోదండరామ్, సీపీఐని బుజ్జగించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక దూతలు వస్తున్నట్టు సమాచారం. కోదండరామ్ కు డిప్యూటీ సీఎం లేదా రాజ్యసభ పదవిని అప్పగించాలనే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న సీపీఐ ఆశావహులకు కార్పొరేషన్ పదవులు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం సీట్లు ముఖ్యం కాదు... టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యమని చెబుతోంది.

More Telugu News