వెంకన్నకు వితరణ... రూ. 1,11,11,111 కానుకిచ్చిన రిలయన్స్!

  • అవసరమైన పథకానికి వినియోగించుకోవచ్చు 
  • టీటీడీ అధికారులతో రిలయన్స్ ప్రతినిధులు
  • స్వామివారి దర్శనం చేయించిన అధికారులు
పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి రూ. 1,11,11,111ను విరాళంగా ఇచ్చింది. దేవస్థానానికి అవసరమైన పథకానికి ఈ నిధులను వినియోగించుకోవాలని సూచించింది. రిలయన్స్ తరఫున సంస్థ సీఈఓలు పీ మధుసూదన ప్రసాద్, వీవీఎల్ మాధవరావులు ఈ చెక్కును డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ కు అందించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన వీరు, అనంతరం చెక్కును అందించారు. వారికి ఆశీర్వచనం పలికిన పండితులు, ఆపై లడ్డూ ప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
Reliance
TTD

More Telugu News