Guntur: నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. మంటలార్పుతున్న సిబ్బంది

  • టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
  • భారీగా ఎగసిపడుతున్న మంటలు
  • అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వరకుంటలోని టింబర్ డిపోలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి క్షణాల్లోనే ఎగసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు చుట్టుముట్టడంతో స్థానికులు ఆందోళన చెందారు. వారిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో విలువైన టేకు పూర్తిగా కాలి బూడిదైంది. ఆస్తి నష్టం భారీగా సంభవించినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News