alhabad: అలహాబాద్ పేరు మార్పుకు తొలగిన అడ్డంకులు!

  • ప్రయాగ్‌రాజ్‌గా అలహాబాద్‌
  • వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం
  • గత వారమే పేరు మార్చిన సీఎం యోగి

అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. గత శనివారమే అలహాబాద్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా మారుస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పిన విషయం తెలిసిందే.

గంగ, యమున కలిసే సంగమాన్ని మాత్రం ‘ప్రయాగ్’ అనే పిలుస్తున్నారు. రెండు నదులు కలిసిన చోటును ప్రయాగ్ అంటారు. బ్రహ్మదేవుడు తొలి యజ్ఞం చేసింది ఇక్కడే. కానీ అలహాబాద్‌లో మాత్రం గంగ, యమున, సరస్వతి కలుస్తున్నాయి. దీనికి ‘ప్రయాగాల రాజు’గా పిలుస్తారు. అందుకే ప్రయాగ్‌రాజ్‌గా పేరు మారుస్తున్నామని సీఎం యోగి వెల్లడించారు.

అయితే ఈ పేరు మార్పును సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వాస్తవానికి అలహాబాద్ నగర పురాతన కాలంనాటి పేరు ప్రయాగ్. 16వ శతాబ్ధంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలన సమయంలో ఈ పేరును మార్చారు. అక్బర్ అక్కడో కోటను నిర్మించి దానితోపాటు చుట్టుపక్కల ప్రాంతానికి ఇలహాబాద్ అని పెట్టారు. ఆ తర్వాత అక్బర్ మనవడు షాజహాన్ ఆ పేరును అలహాబాద్‌గా మార్చారు.

More Telugu News