currency exchange: రద్దయిన 1000, 500 నోట్ల అక్రమ లావాదేవీలు.. విలువలో పది శాతం చెల్లింపు!

  • చిత్తూరు జిల్లా గుర్రం కొండ కేంద్రంగా భారీగా కమిషన్‌ వ్యాపారం
  • జాతీయ రహదారికి ఇరువైపులా దుకాణాల వద్ద ఏజెంట్ల మకాం
  • సేకరించిన నోట్లు కర్ణాటకకు తరలింపు

రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ.వెయ్యి, రూ.500 నోట్ల వ్యాపారం మళ్లీ జోరుగా సాగుతోంది. కొందరు కమిషన్‌ ఏజెంట్లు విలువలో పది శాతం ఇచ్చి పాత నోట్లను భారీగా సేకరిస్తున్నారు. చిత్తూరు జిల్లా గుర్రం కొండ మండల కేంద్రంలో ఇప్పుడిదో హాట్‌ టాపిక్‌గా మారింది.

జాతీయ రహదారికి అటూ ఇటూ ఉన్న చిల్లర దుకాణాల వద్ద మకాం వేసిన ఏజెంట్లు 500 నోటు తెచ్చిన వారికి రూ.50, వెయ్యి నోటు తెచ్చిన వారికి రూ.100 ఇస్తున్నారు. పెద్దమొత్తంలో నోట్లు తెచ్చిన వారికి ఇదే బేసిస్‌పై డబ్బిచ్చి తీసుకుంటున్నారు. నోట్ల రద్దు వ్యవహారం పూర్తిగా తెరవెనుకకు వెళ్లిపోయి, మార్చుకునే ఆఖరి అవకాశం కూడా అయిపోయాక ఏజెంట్లు ఇప్పుడెందుకీ నోట్లు సేకరిస్తున్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. తాము సేకరించిన నోట్లను ఏజెంట్లు కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నట్లు సమాచారం. పోలీసులు చొరవ చూపితే తప్ప ఈ రహస్యం వీడదేమో.

  • Loading...

More Telugu News