amaravathi: విస్తీర్ణం 41 ఎకరాలు...ఎత్తు 212 మీటర్లు : అమరావతిలో ఏపీ సచివాలయం లెక్క ఇది

  • ప్రపంచంలోనే ఎత్తయిన భవనంగా రికార్డు
  • అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో ప్రకటించిన సీఎం చంద్రబాబు
  • అత్యుత్తమ ప్రమాణాలతో మౌలిక వసతులు

ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతిలో మరో అద్భుతం చోటు చేసుకోబోతోంది. ప్రపంచంలో కెల్ల అత్యంత ఎత్తయిన సచివాలయ భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. 41 ఎకరాల విస్తీర్ణంలో 695 అడుగులు (212 మీటర్లు) ఎత్తున సచివాలయ భవన నిర్మాణం చేపట్టనున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.

ఏపీ సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇది తొలి డయాగ్రిడ్‌ భవనమని, దీనికి ట్విన్‌ లిఫ్ట్‌ సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. చరిత్ర సృష్టించనున్న భవనం కాబట్టి, మౌలిక సదుపాయాలు కూడా అత్యున్నత స్థాయిలో కల్పించాలని అధికారులను ఆదేశించారు.

‘ప్రపంచంలోనే ఐదు అత్యున్నత నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అతితక్కువ సమయంలోనే తాత్కాలిక భవనాలు నిర్మించి చరిత్ర సృష్టించాం. ఈ స్ఫూర్తి కొనసాగించాలి’ అని సూచించారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే పెట్టుబడులు తరలివస్తున్నాయని, సమీప భవిష్యత్తులో అమరావతిలో జనాభాతోపాటు ఆర్థిక వృద్ధి గణనీయంగా ఉంటుందని తెలిపారు. అమరావతిలో జనాభావృద్ధితో ఒనగూరే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా సీఆర్‌డీఏ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ సీఎంకు వివరించారు.

More Telugu News