Madhavan Nair: బీజేపీలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్

  • కండువా కప్పి ఆహ్వానించిన అమిత్ షా
  • మతపరమైన అంశాల్లో ప్రభుత్వాల జోక్యం తగదన్న నాయర్
  • ఆంటిక్స్-దేవాస్ కేసులో నిషేధం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కేరళలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతపరమైన అంశాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. సొంతంగా రాకెట్‌ను ప్రయోగించే సామర్థ్యం లేని పాకిస్థాన్ 2022 నాటికి చైనా సాయంతో అంతరిక్షంలోకి మానవులను పంపిస్తామనడం హాస్యాస్పదమన్నారు.

2011లో ఆంటిక్స్-దేవాస్ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత మాధవన్ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయకూడదంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం నాయర్‌పై నిషేధం విధించింది. దీంతో అప్పటి నుంచి ఆయన బీజేపీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు నేరుగా బీజేపీలో చేరి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.  

  • Loading...

More Telugu News