KCR: కేసీఆర్ ఫాంహౌస్‌కు.. కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయం: ఉత్తమ్

  • కేటీఆర్ పొగరు అణిచేందుకు సమాజం సిద్ధం
  • కేసీఆర్, కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
  • పొత్తు పెట్టుకున్న వారిలో ఆంధ్రా వారెవరో చెప్పాలి
కేసీఆర్, కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని.. కేటీఆర్ పొగరు అణిచేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేసీఆర్ కుటుంబం మాత్రమే టీఆర్‌ఎస్‌లో ఉంటుందన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌కు.. కేటీఆర్ అమెరికాకు వెళ్లడం ఖాయమని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ అతి తెలివితో కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేశారని విమర్శించారు. తాము ఆంధ్రా పార్టీతో పొత్తు పెట్టుకున్నామని కేసీఆర్, కేటీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారన్న ఉత్తమ్.. కోదండరాం, రమణ, చాడా వెంకటరెడ్డి తదితరులలో ఎవరు ఆంధ్రకు చెందినవారో చెప్పాలని ప్రశ్నించారు.
KCR
KTR
Uttam Kumar Reddy
Chada Venkat Reddy
Kodandaram
Ramana

More Telugu News