jagan: కోడి కత్తిని ఎవరు తీసుకెళ్లారు.. రక్తపు మరకలు లేకుండా ఎవరు చేశారు?: దేవినేని ఉమ

  • దాడిపై పోలీసులకు జగన్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
  • జగన్ బయటకు వచ్చి నోరు విప్పాలి
  • పోలవరం ప్రాజెక్టును బీజేపీ అడ్డుకుంటోంది
విశాఖపట్నం విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడికి సంబంధించి ఏపీ మంత్రి దేవనేని ఉమ పలు అనుమానాలను లేవనెత్తారు. జగన్ పై దాడి జరిగిన వెంటనే కోడి కత్తిని ఎవరు తీసుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. కత్తికి రక్తపు మరకలు లేకుండా ఎవరు చేశారో విచారణలో తేల్చాలని డిమాండ్ చేశారు. నిందితుడు శ్రీనివాస్ కు టీడీపీ సభ్యత్వం ఉన్నట్టు దొంగ కార్డును తయారు చేశారని... దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. జగన్ మౌనం వీడాలని... బయటకు వచ్చి నోరు విప్పాలని అన్నారు.

వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు తెగబడుతున్నారని ఉమ విమర్శించారు. వైసీపీ నేతలను బీజేపీ నేతలే రాష్ట్రపతి, కేంద్ర మంత్రుల వద్దకు పంపుతున్నారని దుయ్యబట్టారు. దాడి జరిగిన వెంటనే విశాఖపట్నంలోని ఆసుపత్రిలో జగన్ ఎందుకు చేరలేదని... పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని... రూ. 3,150 కోట్ల బకాయిలను కూడా చెల్లించలేదని మండిపడ్డారు. డీపీఆర్-2ను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. 
jagan
devineni uma
bjp
YSRCP
Telugudesam
polavaram

More Telugu News