Nimmakayala Chinarajappa: చిన్న సంఘటనతో శాంతి భద్రతలు లోపించాయని ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదం: హోంమంత్రి

  • జగన్ పాదయాత్రకు రక్షణ కల్పించాం
  • శ్రీనివాసరావు వైసీపీ కార్యకర్తే
  • కేంద్ర ప్రతిపక్షాలను కలిస్తే జీవీఎల్‌కు ఉలుకెందుకు?
చిన్న సంఘటనను ఆధారం చేసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని హోమంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప వ్యాఖ్యానించారు. మూడు వేల కిలోమీటర్లు ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర చేస్తే ఆయనకు రక్షణ కల్పించామన్నారు. నేడు తుని మండలంలోని తలుపులమ్మలోవ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం చిన్న రాజప్ప మీడియాతో మాట్లాడారు.

జగన్‌పై కత్తి దాడికి పాల్పడిన శ్రీనివాసరావు వైసీపీ కార్యకర్తేనని స్పష్టం చేశారు. అతడిని విచారించి కోర్టులో హాజరు పరిచామని వెల్లడించారు. చంద్రబాబు కేంద్ర ప్రతిపక్షాలను కలిస్తే అడ్డదారిలో రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్ నరసింహారావుకు ఉలుకెందుకని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని జీవీఎల్ మాట్లాడటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని చిన్న రాజప్ప ఎద్దేవా చేశారు. జగన్ ద్వారా బీజేపీ చంద్రబాబును ఇబ్బందిపెట్టాలని చూస్తోందని విమర్శించారు.  
Nimmakayala Chinarajappa
Chandrababu
Jagan
YSRCP
Ganta Srinivasa Rao
GVL Narasimha Rao

More Telugu News