sruthi haraharan: హీరోయిన్ శృతి హరిహరన్ కు సంబంధించిన అసలు నిజం వెలుగు చూసింది!

  • శృతి హరహరన్ కు పెళ్లయింది
  • ఆమె భర్త డ్యాన్స్ మాస్టర్ 
  • ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు
సీనియర్ నటుడు అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన హీరోయిన్ శృతి హరహరన్... ఆయనపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగు చూసింది. అదేంటంటే ఇప్పటికే ఆమెకు పెళ్లయింది.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులలో ఆమె తనను శ్రీమతి అని రాసుకున్నారు. దీనిపై పోలీసులు వివరణ కోరగా.... తనకు పెళ్లయిందని, కానీ ఆ విషయాన్ని ఇంత వరకు బయటకు చెప్పలేదని తెలిపింది. తన భర్త డ్యాన్స్ మాస్టర్ రామ్ కుమార్ అని చెప్పింది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నామని తెలిపింది. శృతికి పెళ్లి అయిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.




sruthi haraharan
kollywood
marriage

More Telugu News