kcr: ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్

  • బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరిన కేసీఆర్
  • ప్రత్యేక విమానంలో పయనం
  • మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరారు. హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీలో ఆయన కంటి, పంటి సమస్యలకు చికిత్స చేయించుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. రెండు, మూడు రోజులపాటు ఆయన ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే... కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
kcr
TRS
delhi

More Telugu News