hero shivaji: ఏపీ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కొత్త నాయకుడి ప్లాన్ విఫలమైంది: హీరో శివాజీ

  • త్వరలోనే ఆ కుట్ర గురించి బయటపెడతా 
  • గతంలో నేను చెేసిన ప్రతి వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నా
  • ఓ ఇంటర్వ్యూలో శివాజీ

ప్రత్యేక హోదా సాధన సమితి నేత, హీరో శివాజీ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొత్త నాయకుడు వేసిన ప్లాన్ విఫలమైందని అన్నారు. త్వరలోనే ఆ కుట్ర గురించిన సమాచారాన్ని బయటపెడతానని చెప్పిన శివాజీ, ఆ కొత్త నాయకుడు ఎవరన్న విషయాన్ని బయటపెట్టక పోవడం గమనార్హం. గతంలో తాను చెేసిన ప్రతి వ్యాఖ్యకు కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా శివాజీ పేర్కొన్నారు.  

More Telugu News