Andhra Pradesh: ఏపీ, తెలంగాణాల్లో కుటుంబపాలన సాగుతోంది: కేంద్ర మంత్రి గడ్కరీ విమర్శలు

  • ఈ రాష్ట్రాల్లో పేదల కోసం పాటుపడే ప్రభుత్వాలు లేవు
  • పేదల కోసం మోదీ సర్కార్ పలు పథకాలు తెచ్చింది
  • నదుల అనుసంధానం కోసం కేంద్రం కృషి చేస్తోంది

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబపాలన సాగుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఈరోజు జరిగిన బీజేవైఎం సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, పేదల కోసం పాటుపడే ప్రభుత్వాలు ఈ రెండు రాష్ట్రాల్లో లేవని విమర్శించారు.

పేదల కోసం మోదీ సర్కార్ అనేక పథకాలు తీసుకొచ్చిందని, రూ.70 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్ట్ ను నిర్మిస్తోందని అన్నారు. అలానే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కూడా కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని, వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్, హైవే గ్రిడ్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. నదుల అనుసంధానం కోసం కేంద్రం కృషి చేస్తోందని, దేశ వ్యాప్తంగా లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందిస్తున్నామని, దేశంలో విద్యుత్ కొరత లేకుండా చేశామని చెప్పారు.

More Telugu News