pune: పూణే వన్డే.. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

  • హోల్డర్ వేసిన బంతికి రోహిత్ శర్మ అవుట్
  • 8 పరుగులు చేసిన రోహిత్ శర్మ
  • పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 54/1
పూణే వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 1.6 వ ఓవర్ లో హోల్డర్ వేసిన బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ (8) అవుటయ్యాడు.  ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న శిఖర్ ధావన్ 20 పరుగులతో, విరాట్ కోహ్లీ 24 పరుగులతో కొనసాగుతున్నారు. పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 54/1.

కాగా, 284 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే తొలి వికెట్ కోల్పోవడం గమనార్హం. ఇప్పటివరకు భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండు వన్డేల్లో ఒకటి భారత్ సొంతం చేసుకోగా, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. పూణే వేదికగా జరుగుతున్న మూడో మ్యాచ్ లో విజయం సాధించాలని రెండు జట్లు చూస్తున్నాయి.  
pune
team india
westindies
Rohit Sharma

More Telugu News