Chandrababu: కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తోంది: సీఎం చంద్రబాబు

  • మనం ఉన్నది నియంతృత్వ పాలనలో కాదుగా? 
  • కేంద్రం ఎలాంటి విలువలూ పాటించడం లేదు
  • జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో భయం నెలకొంది  
ఏపీలో ప్రభుత్వాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని సీఎం చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్సేతర అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ ఎటువంటి ఉపయోగం లేదని, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం గానీ, నియంతృత్వంలో పాలనలో కాదుగా? కేంద్రం ఎలాంటి విలువలూ పాటించడం లేదని మండిపడ్డారు.

ఈ రోజు జరుగుతున్న పరిణామాలతో దేశ ప్రజలు తీవ్రంగా భయపడుతున్నారని విమర్శించారు. దేశ ప్రజలంతా ఏపీ పరిస్థితిని అర్థం చేసుకుంటారని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. తన పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానని, ఏపీలోని ఐదు కోట్ల మంది ప్రజలు తమ వెంటే ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu
Telugudesam
bjp
delhi

More Telugu News