స్వశక్తి భారత్ నిర్మాణం వైపు యువత అడుగులు : కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీజేవైఎం జాతీయ మహాసభలు ప్రారంభం
- దక్షిణ భారత దేశంలో తొలిసారి తెలంగాణలో నిర్వహణ
- దేశం నలుమూలల నుంచి 40వేల మంది ప్రతినిధుల హాజరు
కాగా, దక్షిణ భారత దేశంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ సభలకు దేశం నలుమూలల నుంచి 40 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు విజయ సూచకంగా హైదరాబాద్ కేంద్రంగా ఈ మహా సభలను రెండు రోజులపాటు నిర్వహిస్తున్నారు. భారీగా తరలివచ్చిన ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.