agri gold: అగ్రిగోల్డ్ యాజమాన్య ప్రతిపాదనను తిరస్కరించిన హైకోర్టు

  • హాయ్‌ల్యాండ్ విలువ రూ.550 కోట్లని నిర్ణయం
  • తదుపరి విచారణ నవంబర్ 9కి వాయిదా
  • సంస్థ ఆస్తుల విలువను కోర్టుకు తెలిపిన ఏపీ, తెలంగాణ సీఐడీ

2022 వరకూ గడువు ఇస్తే రూ. 8500 కోట్లు చెల్లించేందుకు సిద్ధమనే అగ్రిగోల్డ్ ప్రతిపాదనను హైకోర్టు తిరస్కరించింది. హాయ్‌ల్యాండ్ విలువ రూ.550 కోట్లని కోర్టు నిర్ణయించింది. అగ్రిగోల్డ్ కేసుపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కోర్టు తదుపరి విచారణను నవంబర్ 9కి వాయిదా వేసింది.

ఇదిలావుండగా, ఏపీలో ఉన్న 83 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను ఏపీ సీఐడీ సీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించగా.. తెలంగాణలో ఉన్న 195 అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను తెలంగాణ సీఐడీ కోర్టుకు సమర్పించింది. విజయవాడలో ఉన్న కార్పొరేట్ కార్యాలయ భవనాన్ని విక్రయించగా వచ్చిన రూ.11 కోట్లను కొనుగోలుదారులు కోర్టులో డిపాజిట్ చేశారు.

More Telugu News