ys jagan: ఈ జగన్నాటకం గురించి వాళ్లిద్దరూ ముందుగానే ప్లాన్ వేశారు: బుద్ధా వెంకన్న ఆరోపణలు

  • ఏపీలో జగన్నాటకం జరుగుతోంది
  • దీనికి ప్రధాని మోదీయే డైరెక్టర్
  • జీవీఎల్, విజయసాయిరెడ్డి కలిసి ముందుగానే ఈ దాడికి పథకం పన్నారు
వైసీపీ అధినేత జగన్ పై జరిగిన కత్తి దాడిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో జగన్నాటకం జరుగుతోందని, దీనికి ప్రధాని మోదీయే డైరెక్టర్ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ జగన్నాటకం గురించి ప్రజలకు పూర్తిగా అర్థమైందని అన్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జగన్ పై దాడి జరగడం, ఆ ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడం చూస్తుంటే పలు అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు.

విజయవాడలోని ఓ రహస్య ప్రదేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసి ముందుగానే ఈ దాడికి ప్లాన్ వేశారని, ఈ ప్లాన్ లో జగన్, శ్రీనివాస్ (నిందితుడు)లు నటులని విమర్శించారు. నీచమైన రాజకీయాలకు తెరలేపారని, ఈ సంఘటనతో జగన్ మోహన్ రెడ్డి బండారం బట్టబయలైందని, ఇక ప్రధాని మోదీ బండారం బట్టబయలు కావాల్సి ఉందని విమర్శించారు. 2019 ఎన్నికల్లో మోదీని ప్రజలు తరిమికొట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.
ys jagan
buddha venkanna
gvl
vijayasai reddy

More Telugu News