somi reddy: మేము ప్లాన్ చేస్తే ఇలా గుచ్చుకోవడాలు ఉండవు.. రాజారెడ్డి, వైయస్, జగన్ తరహాలోనే ప్లాన్ చేస్తాం: సోమిరెడ్డి

  • పాదయాత్రలో జగన్ కు చిన్న ఇబ్బంది కూడా కలగలేదు
  • కేంద్రం అధీనంలో ఉండే విమానాశ్రయంలో దాడి జరిగింది
  • కేంద్ర ప్రభుత్వ డ్రామాకు సీఐఎస్ఎఫ్ సహకరించింది
జగన్ పై దాడి చేయడానికి ఒక పిల్ల కుంకతో కలసి చంద్రబాబు దాడి చేయిస్తారా? అంటూ మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. తాము నిజంగా ప్లాన్ చేస్తే ఇలా గిచ్చుకోవడాలు, గుచ్చుకోవడాలు ఉండవని అన్నారు. తమ ప్లానింగ్ కూడా రాజారెడ్డి, వైయస్, జగన్ తరహాలోనే ఉంటుందని... కానీ అలాంటి చెడు ఆలోచనలు తమకు లేవని చెప్పారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ కు చిన్న ఇబ్బంది కూడా రాకుండా తాము చూసుకున్నామని... కానీ, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే విమానాశ్రయంలోకి వెళ్లగానే దాడి జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆడిన ఈ డ్రామాకు సీఐఎస్ఎఫ్ కూడా సహకరించిందా? అని ప్రశ్నించారు.

జగన్ కు అర సెంటీమీటర్ గాయమైతే గవర్నర్ విచారణ చేయాలా? అని సోమిరెడ్డి విమర్శించారు. ఈ దాడి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు ఒక్క మాట కూడా అనలేదని మండిపడ్డారు. జరిగిన ఘటనపై ఒక కంప్లైంట్ కూడా ఇవ్వని జగన్... వేరే రాష్ట్రానికి వెళ్లి వైద్యం చేయించుకున్నారని ఎద్దేవా చేశారు.  
somi reddy
jagan
stab

More Telugu News