jagan: జగన్ పై దాడిపై అనుమానం వ్యక్తం చేసిన జలీల్ ఖాన్

  • జగన్ పై దాడి చేసిన వ్యక్తిని ఏమీ చేయలేదు
  • చితకబాదకుండా వదిలేసేంత సహనం వైసీపీకి ఉందా?
  • బీజేపీతో కలసి అలజడులు రేపేందుకు జగన్, పవన్ లు కుట్ర పన్నారు
వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటనపై మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను పొడవమని వైసీపీ నేతలే ఆ యువకుడికి కత్తి ఇచ్చినట్టు ఉందని అన్నారు. జగన్ వంటి నేతపై కత్తితో దాడి జరిగితే అతడిని చితకబాదకుండా, పోలీసులకు అప్పగించేంత సహనం వైసీపీకి ఉందా? అని ప్రశ్నించారు. గతంలో ఏపీ అభివృద్ధిని జగన్ మాత్రమే అడ్డుకునేవారని... ఇప్పుడు ముగ్గురు (జగన్, పవన్, బీజేపీ) అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలసి రాష్ట్రంలో అలజడులు రేపేందుకు జగన్, పవన్ లు కుట్రపన్నారని చెప్పారు. 
jagan
stab
jaleel khan

More Telugu News