up bsp chief dharmveer: మరో వందేళ్లు ఆంగ్లేయులు పాలించి ఉంటే బాగుండేది!: బీఎస్పీ నేత ధరంవీర్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

  • బ్రిటీష్‌ పాలనవల్లే అంబేడ్కర్‌కు చదువుకునే అవకాశం దక్కింది
  • అణగారిన వర్గాలకు దారిచూపే నాయకుడు లభించాడన్న ధరంవీర్ 
  •  విపక్షాల విమర్శల దాడి
బ్రిటీష్‌ పాలకులు ఇప్పటి వరకు మన దేశాన్ని పాలించి ఉంటే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సమగ్రాభివృద్ధి సాధించే వారని బీఎస్సీ ఉత్తరప్రదేశ్‌ చీఫ్‌ ధరంవీర్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరో వందేళ్లు వారి పాలనా కాలం కొనసాగి ఉంటే బాగుడేందన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో ధరంవీర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఈ దేశానికి అంబేడ్కర్‌ వంటి దళిత నాయకుడు లభించాడంటే అది బ్రిటీష్‌ వారి పుణ్యమే. ఇప్పటి లాంటి పాలకులు ఉండి ఉంటే ఆయనకు ఏ పాఠశాలలోనూ కనీసం చదువుకునేందుకు సీటు దొరికేది కాదు. దేశంలో అణగారిన వర్గాలకు ఆయన సేవలందించే అవకాశం ఉండేది కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ధరంవీర్‌ వ్యాఖ్యలపై విపక్ష పార్టీ నాయకులు మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు మహానుభావులు చేసిన త్యాగాలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతగా ఆయనకు ఆంగ్లేయులపై అభిమానం ఉంటే బ్రిటన్‌ శరణార్థిగా ఉండాలని సూచించారు.
up bsp chief dharmveer
coments critisised
Rajasthan

More Telugu News