prathibha bharathi: ప్రతిభా భారతికి గుండెపోటు

  • ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న ప్రతిభా భారతి తండ్రి
  • తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసి, స్పృహ తప్పి పడిపోయిన ప్రతిభ
  • ఇదే సమయంలో గుండె పోటుకు గురైన వైనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి గుండె పోటుకు గురయ్యారు. విశాఖలోని పినాకిని ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి జస్టిస్ పున్నయ్య (92)ను చూసేందుకు ప్రతిభా భారతి ఆసుపత్రికి వచ్చారు. తండ్రిని ఆ పరిస్థితుల్లో చూసిన ఆమె... తట్టుకోలేక, స్పృహ తప్పి పడిపోయారు. ఇదే సమయంలో ఆమె గుండె పోటుకు గురయ్యారు. దీంతో, ఆమెకు డాక్టర్లు హుటాహుటిన చికిత్సను ప్రారంభించారు. గుండె సంబంధిత పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News