Telangana: తెలంగాణ ఎన్నికలకు కొత్త తలనొప్పి.. మూతపడనున్న 4,500 మీ-సేవా కేంద్రాలు!

  • సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమైన మీసేవా నిర్వాహకులు
  • ప్రభుత్వ ఫీజులతో గిట్టుబాటు కావడం లేదని ఆవేదన
  • ఇబ్బందులు ఎదుర్కోనున్న 17 లక్షల కొత్త ఓటర్లు

తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా ఖరారు సహా పలు అంశాలపై ఈసీ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ మీ-సేవ కేంద్రాల నిర్వాహకులు సంచలన ప్రకటన చేశారు. సర్వీసు చార్జీలను పెంచాలనీ కోరుతూ నవంబర్ 1 నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మీ-సేవాల కేంద్రాలను మూసివేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 17 లక్షల మంది కొత్తవారు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది తమ ఓటర్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాలపైనే ఆధారపడే అవకాశం ఉంది. తాజాగా మీ-సేవా కేంద్రాల నిర్వాహకుల సమ్మె నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 4,500 మీ-సేవా కేంద్రాల్లో 300 రకాల సేవలు అందజేస్తున్నారు. ఈ సేవలపై 2008లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన ధరలనే ఇంకా వసూలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఒక్కో ఓటర్ కార్డు కోసం ఆపరేటర్లు రూ.25 వసూలు చేస్తున్నారు. అయితే ఇందులో అన్ని పన్నులు పోగా నిర్వాహకులకు కేవలం రూ.13 మాత్రమే మిగులుతుంది. కానీ ఖర్చు మాత్రం రూ.35 అవుతోంది. ఈ నేపథ్యంలో అందిస్తున్న సేవల ధరలు పెంచాలని మీసేవా కేంద్రాల ఆపరేటర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో వచ్చే నెల 1 నుంచి సమ్మె చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News