Tollywood: అలనాటి హాస్యనటుడు రమణారెడ్డి భార్య కన్నుమూత

  • అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సుదర్శనమ్మ
  • చెన్నైలోని స్వగృహంలో కన్నుమూత
  • నేడు అంత్యక్రియలు
అలనాటి మేటి హాస్యనట దిగ్గజం రమణారెడ్డి భార్య సుదర్శనమ్మ (93) గురువారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నెల రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఇంటికి చేరిన ఆమెకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. గురువారం సాయంత్రం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Tollywood
Comedian
Ramana Reddy
Sudarsanamma
Chennai

More Telugu News