Jagan: జగన్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కేసీఆర్

  • చికిత్స వివరాలను తెలుసుకున్న కేసీఆర్
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
  • తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచన
విశాఖ విమానాశ్రయంలో దాడి అనంతరం వైసీపీ అధినేత హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జగన్‌కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయం తీవ్రత, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న కేసీఆర్.. తగినంత విశ్రాంతి తీసుకోవాలని జగన్‌కు సూచించారు. జగన్‌కు శస్త్ర చికిత్స నిర్వహించామని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు తెలిపారు.
Jagan
Vizag
Attack
KCR
Hyderabad

More Telugu News