Anchor Rashmi: ఆటో ఇమ్యూన్ సమస్యల కారణంగా స్టెరాయిడ్స్ వాడాను: రష్మి

  • 5 ఏళ్ల పాటు రుమటాయిడ్‌తో బాధపడ్డాను
  • తీవ్ర నొప్పిని కలిగించే ఇంజెక్షన్లు తీసుకున్నా
  • అమ్మ చిట్కాలతోనే ఉపశమనం పొందా
ప్రముఖ యాంకర్ రష్మి తాను గతంలో స్టెరాయిడ్స్ వాడానని తెలిపి నెటిజన్లను షాక్‌కి గురిచేసింది. ఓ నెటిజన్ సమస్యకు పరిష్కారం చెబుతూ ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. 12 ఏళ్ల వయసులో దాదాపు 5 ఏళ్ల పాటు రుమటాయిడ్ ఆర్త్రైటిస్‌తో రష్మి బాధపడిందట. దాంతో ఆటో ఇమ్యూన్ సమస్యల కారణంగా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది.

ఓ నెటిజన్ రష్మికి చేసిన ట్వీట్‌లో... తన భర్త రుమటాయిడ్ ‌తో బాధపడుతున్నారని.. చికిత్స ఉందో లేదో తెలియదని.. మీరు రుమటాయిడ్‌తో బాధపడ్డారు కాబట్టి సమస్యకు పరిష్కారం సూచించగలరా? అని ట్వీట్ చేసింది. దీనికి రష్మి రుమటాయిడ్‌కి తీవ్రంగా నొప్పి కలిగించే ఇంజెక్షన్లను తీసుకున్నాని.. కానీ అమ్మ చెప్పిన చిట్కాల కారణంగానే ఉపశమనం పొందానని వెల్లడించింది. రోజూ వ్యాయామం చేస్తుండాలని, తాజా ఆహారాన్ని తీసుకోవాలని.. ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచించింది. ఈ సందర్భంగానే తాను ఆటో ఇమ్యూన్ సమస్యల వల్ల స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
Anchor Rashmi
Steroids
Rumatoid
injection

More Telugu News