Chandrababu: జగన్ పై దాడిని ఖండిస్తున్నాం: సీఎం చంద్రబాబునాయుడు

  • ఏపీలోని తాజా పరిణామాలపై మంత్రులతో బాబు చర్చ
  • ఇలాంటి ఘటనలను ఉపేక్షించం
  • రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సంబంధం లేని విషయం
విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అమరావతిలో మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఆయన చర్చించారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సంబంధం లేని విషయమని, ఈ ఘటనను అడ్డుపెట్టుకుని అల్లర్లకు దిగితే సహించే ప్రసక్తే లేదని అన్నారు.
Chandrababu
jagan
Vizag
airport

More Telugu News