charan: బుల్లితెరపై కూడా దూసుకెళ్లిన 'రంగస్థలం'

  • భారీ సక్సెస్ ను సాధించిన 'రంగస్థలం'
  • 200 కోట్ల గ్రాస్ .. 120 కోట్ల షేర్ 
  • బుల్లితెరపై 19.5 రేటింగ్

సుకుమార్ దర్శకత్వంలో చరణ్ .. సమంత జంటగా నటించిన 'రంగస్థలం' వెండితెరపై సంచలన విజయాన్ని నమోదు చేసింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. సుకుమార్ కి గల ఇమేజ్ .. చరణ్ - సమంతకి గల క్రేజ్ కారణంగా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. జగపతిబాబు .. అనసూయ పాత్రలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

 కథాకథనాలు .. సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఈ సినిమా 200 కోట్లకి పైగా గ్రాస్ ను .. 120 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా క్రితం వారం బుల్లితెరపై ప్రసారమైంది. బుల్లితెరపై ఈ సినిమా 19.5 టీఆర్పీ రేటింగ్ ను తెచ్చుకోవడం విశేషం. చరణ్ సినిమాల్లో బుల్లితెరపై ఈ స్థాయి రేటింగ్ విశేషమని చెబుతున్నారు. వెండితెరపైనే కాదు .. బుల్లితెరపై కూడా ఈ సినిమా తన సత్తా చాటుకుందన్న మాట. 

  • Loading...

More Telugu News