KTR: మహాకూటమికి ఓటేస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయి: కేటీఆర్

  • మహాకూటమి అనైతిక కలయిక
  • అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ఏమీ చేయలేకపోతోంది
  • వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

మహాకూటమి ఒక అనైతిక కలయిక అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆ కూటమికి ఓటు వేసి గెలిపిస్తే, మళ్లీ వెనుకటి చీకటి రోజులే వస్తాయని అన్నారు. దేశం మొత్తం మీద వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేకపోతోందని... అలాంటిది తెలంగాణలో ఏదో చేస్తామని చెప్పుకుంటుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 

  • Loading...

More Telugu News