Petrol: వరుసగా ఎనిమిదో రోజూ తగ్గిన పెట్రోలు ధరలు!

  • ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గుతున్న క్రూడాయిల్ ధరలు
  • డాలర్ తో బలపడుతున్న రూపాయి మారకపు విలువ
  • పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 5 పైసల మేరకు ధర తగ్గింపు

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు క్రమంగా దిగివస్తూ ఉండటంతో, దాని ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొడుతూ ఆకాశానికి ఎగసిన ధరలు, ఇప్పుడు వరుసగా ఎనిమిదో రోజూ తగ్గాయి. నేడు లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 5 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది.

మారిన ధరలతో హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటరుకు రూ. 85.98, డీజిల్ రూ. 81.36కు తగ్గింది. ఇదే సమయంలో న్యూఢిల్లీలో పెట్రోలు ధర రూ. 81.10కి, డీజిల్ రూ. 74.80కి తగ్గింది. ముంబైలో పెట్రోలు ధర రూ. 86.58కి, డీజిల్ రూ. 78.41కి చేరుకుంది. ఇదిలావుండగా, ఈ నెల ప్రారంభంలో ముడిచమురు ధర బ్యారల్ కు 86 డాలర్లుగా ఉండగా, అదిప్పుడు 76 డాలర్లకు పడిపోవడం, రూ. 74ను దాటిన డాలర్ తో రూపాయి మారకపు విలువ బలపడటం పెట్రోలు, డీజిల్ ధరలను కిందకు దిగేలా చేస్తోంది.

More Telugu News