sexual herasment: బరితెగించిన పంజాబ్ మంత్రి.. మహిళా అధికారిణికి అసభ్యకర సందేశాలు!

  • ముఖ్యమంత్రి అమరీందర్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • మంత్రిని మందలించి, అధికారిణికి క్షమాపణ చెప్పిన సీఎం
  • మంత్రి రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ 

హుందాగా వ్యవహరించాల్సిన మంత్రి ఓ సీనియర్‌ మహిళా అధికారిణికి అసభ్యకర మెసేజ్‌లు పంపించడం వివాదానికి కారణమైంది. బాధితురాలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఆయన సదరు మంత్రిని పిలిచి మందలించడమేకాక, అధికారిణికి క్షమాపణలు చెప్పారు. ఈ విషయం మీడియాకు లీక్‌ కావడంతో మంత్రిని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌ మొదలయ్యింది.

పంజాబ్‌ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే...రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తుండడంతో ఆగ్రహం చెందిన ఆ మహిళా అధికారిణి విషయాన్ని సీఎం అమరీందర్‌సింగ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సీఎం వెంటనే మంత్రిని పిలిపించి మందలించారు. అనంతరం మహిళా అధికారిణికి క్షమాపణలు చెప్పి వివాదాన్ని సద్దుమణిగించారు. అయితే ఈ వివాదం పత్రికల్లో రావడంతో బాధ్యుడైన మంత్రిని పదవి నుంచి తొలగించాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

More Telugu News